గ్రామ, వార్డు సచివాలయ మహిళా పోలీసులు ప్రభుత్వం సూచించిన జాబ్ చార్ట్ ను తప్పకుండా పాటించాలని నూజివీడు డిఎస్పీ అశోక్ కుమార్ గౌడ్ ఆదేశించారు. మంగళవారం డివిజన్ లోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని సిబ్బంది, మహిళా పోలీసులతో ఆయన వీడియోకాన్ఫ రెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ, ఏ విధమైన అసాంఘిక కార్యకలాపాలు సచివాలయాల్లో పరిధిలో జరగకుండా ముందస్తు సమాచారాన్ని సేకరించి సంబంధిత అధికారులకు తెలియజేయాలన్నారు. అదేవిధంగా ప్రభుత్వం సూచించిన చైతన్య అవగాహన కార్యక్రమాలు తప్పని సరిగా చేపట్టలన్నారు. ప్రజలకు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా జరుగుతున్న నేరాల గురించి అవగాహన కార్యక్ర మాలను నిర్వహించాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ నకు నూజివీడు రూరల్ సీఐ అంక బాబు, రూరల్ ఎస్ఐ టి.రామ కృష్ణ నూజివీడు సబ్ డివిజన్ పరిధిలోని అన్ని సచివాలయంలో పనిచేస్తున్నసచివాలయ మహిళా పోలీసులు పాల్గొన్నారు.