రెడీమెడ్ రంగం విస్తరించడంతో టైలరింగ్‌కు గిరాకీ తగ్గి తమ పరిస్థితి దయనీయంగా మారిందని దర్జీలు ఆవేదన వ్యక్తం చేసారు. మంగళ వారం అక్కయ్యపాలెం కూడలిలో గ్రేటర్ విశాఖ టైలర్స్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రపంచ టైలర్స్ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వ హించారు. టైలరింగ్ మెషిన్ సృష్టి కర్త ఐజాక్ మెరిట్ సింగర్ కు ఘనంగా నివాళులు అర్పించారు. అధ్యక్షులు సిహెచ్ యాదిగిరి రెడ్డి మాట్లా డుతూ, గత 23 ఏళ్లుగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని, ఎన్నిసార్లు ప్రభుత్వానికి సామజిక భవనం కోసం విన్నవించుకున్నా కనీస స్పందన లేదన్నారు. తమ కనీస అవసరాలకోసం సామజిక భవనాన్నివెంటనే మంజూరు చేయాలని కోరారు. సంయుక్త కార్యదర్శి కె.సత్యనారాయణ మాట్లాడుతూ అసోసియేషన్ లో ఇప్పటివరకూ సుమారు 150 షాపులకు చెందిన 1000 మంది సభ్యులు ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ కార్యదర్శి సిహెచ్ వేణు,కోశాధికారి సిహెచ్ తిరుపతిరావు, అధిక సంఖ్యలో టైలర్లు పాల్గొన్నారు.