వైభవంగా గండిపేట రామాలయం ప్రారంభోత్సవం


Ens Balu
21
Makavarapalem
2023-03-01 12:20:15

మాకవరపాలెం మండలంలోని భీమబోయినపాలెం శివారు గండిపేటలో నూతనంగా నిర్మించిన రామలయాన్ని వైభవంగా ప్రారంభించారు. గ్రామస్తుల సహకారంతో సుమారు రూ.20 లక్షలు ఖర్చు చేసి నిర్మించిన ఈ ఆలయాన్ని బుధవారం వేదపండితుల మంత్రోచ్ఛారణ నడుమ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీతారాములను దర్శించుకుని స్థానికులు పూజలు చేశారు. అనంతరం మధ్యాహ్నం భారీ అన్నసమారాధన నిర్వహించారు. భక్తులు  పాల్గొని స్వామివారి ప్రసాదం స్వీకరించారు. ఆలయ ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన చిన్నారుల కోలా టం అందరినీ ఆకట్టుకుంది.
సిఫార్సు