ఏపీ ఎస్ఐ ప్రిలిమ్స్ లో సత్తాచాటిన గిరియువత


Ens Balu
23
Paderu
2023-03-01 13:12:39

ఆంధ్ర‌ప్ర‌దేశ్ పోలీసు సెల‌క్ష‌న్ బోర్డు నిర్వ‌హించిన ఎస్సై ప్రిలిమ్స్ ప‌రీక్ష‌ల్లో గిరిజ‌న యువ‌త మ‌రోసారి స‌త్తా చాటారు. ఇటీవ‌ల జ‌రిగిన ఎస్సెస్సీ గ్రాడ్యుయేట్ లెవెల్‌లో 9 మంది, గ్రూప్ -1 ప‌రీక్ష‌లో 12 మంది యువ‌త‌ అత్యుత్త‌మ ప్ర‌తిభ క‌న‌బ‌రిచిన విష‌యం విధిత‌మే. తాజాగా మంగ‌ళ‌వారం వెలువ‌డిన ఎస్సై ప్ర‌లిమిన‌రీ పరీక్ష‌లో 23 మంది గిరిజ‌న యువ‌త శ‌త‌శాతం ఉత్తీర్ణ‌త సాధించి మ‌రోసారి వారి ఘ‌న‌త‌ను చాటుకున్నారు. ఐటీడీఏ ఆధ్వ‌ర్యంలో 21వ సెంచ‌రీ శిక్ష‌ణా సంస్థ ద్వారా వేప‌గుంట వైటీసీలో సివిల్స్ స‌ర్వీసెస్ ప‌రీక్ష‌లు ప్ర‌త్యేక త‌ర్ఫీదు అందిస్తున్నారు. వారిలో 23 మంది యువ‌త ఇటీవ‌ల జ‌రిగిన ఎస్సై ప్ర‌లిమిన‌రీ పరీక్ష‌లు హాజ‌రు కాగా 23 మంది కూడా మెయిన్స్‌కు అర్హ‌త సాధించారు. దీనిపై స్పందించిన ఐటీడీఏ పీవో రోణంకి గోపాల కృష్ణ విజేత‌ల‌కు ప్ర‌త్యేక అభినంద‌న‌లు తెలిపారు. భ‌విష్య‌త్తులో మ‌రిన్ని విజ‌యాలు అందుకోవాల‌ని ఆకాంక్షించారు. ప‌రీక్ష‌కు హాజ‌రైన 23 మంది యువ‌తా ఎస్సై మెయిన్స్ కు అర్హ‌త సాధించటం గ‌ర్హ‌ణీయ‌మ‌ని పేర్కొన్నారు. వీరి చూపిన ప్ర‌తిభ భ‌విష్య‌త్త‌రాల వారికి ఆద‌ర్శంగా నిలుస్తుంద‌ని అన్నారు. 21వ సంచ‌రీ సాఫ్ట్‌వేర్ సొల్యూష‌న్స్ సంస్థ అందిస్తోన్న శిక్ష‌ణ గిరిజ‌న యువ‌త‌కు ఎన్నో విధాలుగా పోటీ ప‌రీక్ష‌లకు దోహ‌ద‌ప‌డుతుంద‌ని ఈ సంద‌ర్భంగా సంస్థ నిర్వాహ‌కురాలు ధ‌ర‌ణి పేర్కొన్నారు.

సిఫార్సు