ఎటువంటి ఆర్థిక అసమానతలు లేని సమసమాజ స్థాపన కోసం, ముఖ్యంగా పేదవర్గాల ఆర్థిక పరిపుష్టికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గారు పేర్కొన్నారు. జి.కొండూరు మండలంలోని కవులూరు గ్రామంలో ఆయన 2వ రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలు ఆయనకు హారతులు ఇచ్చి ఘనస్వాగతం పలికారు. ఎమ్మెల్యే కృష్ణప్రసాదు మాట్లాడుతూ, ప్రతినెల 1నే అవ్వాతాతలకు, అర్హులైన లబ్ధిదారులకు పింఛన్ సొమ్మును నేరుగా వారి ఇంటి ముంగిట అందజేస్తున్న ఘనత మన జగనన్నకే దక్కుతుందన్నారు. గతంలో నూతన పింఛన్ రావాలంటే ఎవరైనా చనిపోతే లేదా పార్టీ జెండా కడితేనే పెత్తందారులు పింఛన్లు మంజూరు చేసే వారన్నారు. కానీ నేడు ఆ పరిస్థితి లేదన్నారు. వాలంటీర్, సచివాలయ వ్యవస్థ ద్వారా అర్హతే ప్రామాణికంగా ఎంత మంది ఉంటే అంతమందికి అందుతున్నాయన్నారు.