మహిళతోనే జీవన గమనం ముడిపడి ఉందని 32వ వార్డు కార్పోరేటర్, కెఎన్ఆర్ ఛారిటబుల్ ట్రస్టు చైర్మన్, దక్షిణ నియోజకవర్గ జనసేన నాయకులు కందుల నాగరాజు అన్నారు. గురువారం విశాఖలోని అల్లిపురంలోని జనసేన పార్టీ కార్యాలయంలో ప్రపంచ మహిళా దినోత్సవ వేకలు ఘనంగా నిర్వహించారు. వార్డులోని పలు రంగాల్లో సేవలు అందించేవారితోపాటు, జనసేన వీర మహిళలను కూడా ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కందుల మాట్లాడుతూ, మహిళతోనే సృష్టి ముడిపడి ఉన్నద న్నారు. అమ్మగా, అక్కగా, చెల్లిగా, భార్యగా దేశ అధ్యక్షురాలిగా నేడు మహిళ అన్ని రంగాల్లో తనదైన ముద్ర వేసుకొన్న మహిళకోసం ఏడాదికి ఒక రోజు కాకుండా అన్ని రోజులూ మహిళా దినోత్సవాలు జరుపుకోవాలన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీలోని మహిళలను వీర మహిళలుగా గుర్తించి వారికి ప్రత్యేక స్థానాన్ని కల్పించి 33శాతం రిజర్వేషన్లు పూర్తిస్థాయిలో అమలు చేస్తున్నారని కొనియాడారు.