సీపిఎస్ రద్దుపై సోమువీర్రాజు సంచనల వ్యాఖ్యలు


Ens Balu
12
2023-03-09 09:56:08

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగుల సిపిఎస్ రద్దుపై బీజేపి రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగులకు పాత పెన్షన్ విధానమే కొనసాగుతుం దని, ఎలాంటి మార్పులు ఉండవన్నారు. విశాఖలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన సిపిఎస్ రద్దు చేసే రాష్ట్రాలకు కేంద్రం నిధుల పంపిణీ కుదించే స్తుందన్న విషయమై మీడియా ప్రశ్నపై సోము పై విధంగా స్పందించారు. ఏపీ ఉద్యోగులను సీఎం వైఎస్.జగన్ దారుణంగా మోసం చేశారన్నారు. అధికారంలో వచ్చిన వారంరోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తానన్న సీఎం మడమ వెనక్కి తిప్పేశారని, ఆ విషయమై ఆందోళన చేస్తున్న ఉద్యోగులను కేసుల పేరుతో బెదిరించి అణగదొక్కాలని చూస్తు న్నారని ఆరోపించారు. సిపిఎస్ బీజేపి రద్దు చేస్తుందా అనే ప్రశ్నకు మాత్రం సరైన సమయంలో దానికి సమాధానం చెబుతాన్నారు. సోము ప్రకటన ప్రస్తుతం అధికార వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని ఇరకాటలంలో పెట్టేలా ఉందనే వాదన కూడా బలంగా వినిపిస్తోంది.

సిఫార్సు