డాక్ యార్డ్ ఉద్యోగులకు సంపూర్ణ సహకారం అందిస్తాం


Ens Balu
12
Visakhapatnam
2023-03-10 09:26:17

నావెల్ డాక్ యార్డ్ ఉద్యోగులకు సంపూర్ణ సహకారం అందిస్తామని  రాజ్యసభ సభ్యులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి.విజయ్ సాయి రెడ్డి అన్నారు. శుక్రవారం విశాఖ సీతమ్మదారలోని నివాసంలో ఆయనను నేవల్ డాక్ యార్డ్ కేటిబి ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు, అధ్యక్షులు బత్తుల చిరంజీవిలు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా సింహాద్రి నాధుడు జ్ఞాపికను  విజయ సాయిరెడ్డి కి శ్రీనుబాబు బహుకరించారు. అనంతరం నావెల్ డాక్ యార్డ్  కేటిబి ఉద్యోగుల సంక్షేమ సంఘం నూతన భవనం ప్రారంభం, ఉద్యోగుల సమస్యలకు సంబంధించి పలు అంశాలపై వీరు విజయ్ సాయి రెడ్డి ద్రుష్టి కి తీసుకెళ్లి చర్చించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిధిలో ఉన్న  ఉద్యోగుల సమస్యలు పరిష్కారానికి తమ ప్రభుత్వం కృత నిశ్చయంతో సహకరిస్తుందని సాయి రెడ్డి హామీ ఇచ్చారు. 
సిఫార్సు