విశాఖలో12న ఎమ్మెల్సీ అభ్యర్ధులతో ముఖాముఖి


Ens Balu
171
Visakhapatnam
2023-03-11 07:09:15

ఉత్తరాంధ్ర జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అభ్యర్థులతో ముఖాముఖి నిర్వహిస్తున్నట్టు ఉత్తరాంధ్ర విద్యావంతుల వేదిక కన్వీనర్ ఆడారి కిషోర్ కుమార్ తెలియచేశారు. శనివారం విశాఖలోని పబ్లిక్ లైబ్రరీ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల బరిలో పోటీపడుతున్న అభ్యర్థులతో నిర్వహించే ముఖాముఖి ద్వారా అభ్యర్ధులు ప్రజలకు చేయబోయే అభివ్రుద్ధి, హామీలు, అభివృద్ధి తెలియజేయడానికి ఆస్కారం వుంటుందన్నారు. ఈ ప్రక్రియ దేశంలోనే మొదటి సారిగా తాము నిర్వహిస్తున్నామన్నారు. అమెరికలాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులతో ప్రజలకు ముఖాముఖి నిర్వహించే సంప్రదాయం ఉందన్నారు. ఓటర్లు అభ్యర్థులను నేరుగా ప్రశ్నించవచ్చునన్నారు. ఈనెల 12న  9.30 గంటలకు విశాఖ పబ్లిక్ లైబ్రరీ లో నిర్వహిస్తున్నట్టు కిషోర్ కుమార్ తెలిపారు. ఈ సమావేశంలో డా.జ్ఞానానంద, వెంకటేష్, శ్రీధర్, వంశీ, అసిత పాల్గొన్నారు.
సిఫార్సు