సింహాద్రి అప్పన్న సోదరి, అడివివరం శ్రీనివాస్ నగర్ పరిసర14 గ్రామాల ప్రజలు పొలిమేర దేవతగా విరాజిల్లుతున్న శ్రీసత్తెమ్మ తల్లి, మరిడిమాంబ అమ్మవారి వార్షిక జాతర మంగళవారం నిర్వహించేందుకు విసృత ఏర్పాట్లు చేస్తున్నట్లు సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు, ఆలయ అభివృద్ది కమిటీ గౌరవ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు, అధ్యక్షులు పి.వెంకటరావులు తెలియజేశారు. ఈ మేరకు సింహాచలంలో శనివారం మీడియాతో మాట్లాడారు. అమ్మవారి పుట్టినరోజు నేపథ్యంలోమా ర్చి14నఅత్యంత వైభవంగా జరిపించనున్నామన్నారు. తెల్లవారుజామునే అమ్మవారిని సూప్రభాత సేవతో మేల్కొలిపి ఆరాధన అనంతరం ప్రత్యేక జలు చేసిన తరువా త భక్తులకు అమ్మవారి దర్శనాలు కల్పిస్తారని వివరించారు. అన్నసంతర్పణ కార్యక్రమం తో పాటు ప్రసాద వితరణ, రాత్రికి పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశామ న్నారు. అభివృద్ధి కమిటీ సంఘం ప్రతినిధులు గంట్ల కనకరాజు, బలిరెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారన్నారు.