భారత ప్రజాస్వామ్యం లో పట్టభద్రుడుగా శాసన మండలి ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించు కోవడం ఎంతో సంతోషం కలిగించిందన్నారు సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం సలహా మండలి సభ్యులు జాతీయ జర్నలిస్ట్ లు సంఘము కార్యదర్శి వైజాగ్ జర్నలిస్ట్ లు ఫోరమ్ అధ్యక్షుడు గంట్ల శ్రీను బాబు. సోమవారం విశాఖలోని అక్కయ్యపాలెం అక్కయ్య పాలెం జివిఎంసీ హైస్కూల్ లో తనఓటు హక్కును వినియోగించుకున్నట్టు చెప్పారు. ఈ సందర్భముగా ఆయన మాట్లాడుతూ, గత ఎమ్మెల్సీ ఎన్నికలతో పోల్చుకుంటే ఈసారి ఓటర్లు శాతం అనూహ్యంగా పెరిగిందని, పట్టభద్రుల్లో పెద్ద ఎత్తున చైతన్యం వచ్చిందన్నారు. ప్రతీ పట్టభద్రుడూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవడం ద్వారా పెద్దల సభకు ప్రజలు మెచ్చిన నాయకుడిని పంపడానికి ఆస్కారం వుంటుందన్నారు. ఇదే స్పూర్తి ప్రతీ పట్టభద్రుడూ కొనసాగించాలని శ్రీనుబాబు కోరారు.