ఉత్తరాంధ్ర పట్ట భద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల తీరును రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు సిద్ధార్ధజైన్ ఒకసాధారణ అధికారిగా విశాఖలోని ఎంవీపి కాలనీలోని ఆల్వార్ దాస్ పోలింగ్ కేంద్రంలో పరిశీలించిన ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎన్నికల కేంద్రంలోనికి తనవాహనాన్ని తీసురాకుండా రోడ్డుపైనే నిలిపివేసి, ఒక సాధారణ అధికారిలా వచ్చి ఎన్నికలు జరుగుతున్న తీరును సూక్ష్మంగా పరిశీలించారు. ఈక్రమంలోనే ఓటు వేయడానికి వచ్చిన ఓటర్లకు సైతం పోలింగ్ కేంద్రాల నెంబర్లు కూడా ఆయనేచెప్పారు. అన్ని బూత్ లలోనూ స్వయంగావెళ్లి పరిశీలించారు. రాష్ట్రస్థాయి ఐఏఎస్ అధికారిఅనే విషయం ఎక్కడా ఎవరికీ తెలియకుండా చాలా చాకచక్యంగా వ్యవహరించారు. ఎన్నికజరుగుతున్న సమయంలో బారులుతీరిన ఓటర్లు మాట్లాడుకునే మాటలను సైతం నిశితంగా విన్నారు. జిల్లా అధికారులు పోలింగ్ కేంద్రాలకు వచ్చినపుడు వెనుక ఉన్నబలగం చేసే హడావిడి అంతా ఇంతా ఉండదు. ఈయన సింగిల్ గానేవచ్చి అంతా పరిశీలించారు.