ప్రత్తిపాడు మండలం వొమ్మంగి గ్రామంలో నాటు సారా విక్రయిస్తుండగా దాడులు చేసి ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్గు ప్రత్తిపాడు ఎస్ఈబి సిఐ పి.అశోక్ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మంగళవారం మీడియాకి ప్రకటన విడుదల చేశారు. సోమవారం అర్ధరాత్రి ముందస్తు సమాచారం మేరకు ఈ.గోకవరం గ్రామంలో వాహన తనిఖీలు చేస్తుండగా AP07 BZ 8065 హీరో స్ప్లెండర్ ప్రోమోటార్ బైకుపై పూజలు సత్తిబాబు, మాడెం గణేష్ అను ఇద్దరు వ్యక్తులు బురదకోట గ్రామం నుండి సుమారు 10లీటర్లు నాటు సారాయిని తీసుకొచ్చి కొప్పన అప్పారావు అనే వ్యక్తికి ఒమ్మంగి గ్రామం రామాలయం దగ్గర ఇస్తుండగాపట్టు కుని వీరిపైకేసు నమోదు చేసి మోటార్ సైకిల్ ను స్వాధీన పరుచుకున్నామని వివరించారు. ఈ దాడుల్లో సబ్ ఇన్స్పెక్టర్ ఆర్.మోహన్ రావు, కానిస్టేబుల్స్ కృష్ణార్జున, ఆర్. దొరబాబు , రాజు తదితర సిబ్బంది పాల్గొన్నారు.