సింహద్రినాధుడి సొదరి, అడవివరం శ్రీనివాస్ నగర్ పరిసర 14 గ్రామాల ప్రజల పొలిమేర దేవతగా విరాజిల్లుతున్న శ్రీ సత్తెమ్మతల్లి మరిడిమాంబ అమ్మవారి వార్షిక జాతర మంగళవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ప్రతిఏటా మార్చి14న అమ్మవారి పుట్టినరోజు నేపధ్యంలో ఈజాతరను సాంప్రదాయబద్దంగా నిర్వహిస్తూవస్తున్నారు. ఇం దులో భాగంగా మంగళవారం తెల్లవారుజామున అమ్మవారిని సుప్రభాతసేవతో మేల్కోలిపి, ఆరాధన నిర్వహించారు. ప్రత్యేక పూజల అనంతరం క్యూలైన్లలో ఉన్న దర్శ నం కల్పించారు. సింహచలం దేవస్ధానం ధర్మకర్తల మండలి సభ్యులు, ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు, అధ్యక్షుడు పి.వేంకటరావు ఆధ్వర్యంలో భక్తుల కు అన్ని ఏర్పాట్లుచేశారు. మధ్యాహ్నాం బలిరెడ్డి చినఅప్పారావు కుటుంబ సభ్యుల సహకారంతో వేలాది మంది భక్తులకు అన్నసంతర్పణ నిర్వహించారు. జివిఎంసీ మేయర్ గొలగాని హరివెంకట కుమారి దంపతులు అమ్మవారిని దర్శించి పూజలు చేశారు.