జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకొని వెళ్లాలని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. జనసేన పార్టీ స్థా పించి 9 వసంతాలు పూర్తి చేసుకుని 10వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా జీవీఎంసీ 22వ వార్డు కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆధ్వర్యంలో సేవ కార్య క్రమాలు ఏర్పాటుచేశారు. కళాభారతి జనసేన జెండాను ఎగరవేసి జనసైనికులు జెండా వందనంచేశారు. అనంతరం 10కేజీల కేక్ కట్ చేసి జనసైనికులకు అందజేసి పెద్ద ఎత్తున సంబరాలు జరిపారు. అనంతరం రక్త దాన శిబిరంలో రోటరీ బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో జనసైనికులు, అభిమానులు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్సార్సీపీ అరాచక పాలనలో రాష్ట్ర ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నారన్నారు. 100మ జనసైనికులు, వీర మహిళలు రక్తదానం చేశారు.ఈ కార్యక్రమంలో చైతన్య, రూప, శేఖర్, మదుసూదన్ రావ్, పండు, సత్యం, తిరుమల, రవి, కిషోర్ పాల్గొన్నారు.