సచివాలయాల ద్వారా విస్త్రుతంగా సేవలందించాలి


Ens Balu
53
Shankhavaram
2023-03-14 11:46:47

గ్రామ సచివాలయాల  ద్వారా ప్రజలకు విస్త్రుతంగా సేవలు అందించాలని జిల్లా పంచాయతీ అధికారి విక్టర్ సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం శంఖవరం మండల కేంద్రంలోని సచివాలయాలన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా డిపిఓ మాట్లాడుతూ, ప్రభుత్వం అములుచేసే సంక్షేమ పథకాలు అర్హులైనవారికి అందించాలన్నారు. అదేవిధంగా గ్రామ పంచాయతీ పరిధిలోని అన్ని ప్రాంతాలు, వీధులు ఎక్కడా చెత్తలేకుండా పరిశుభ్రంగా ఉంచాలన్నారు. శానిటేషన్, మురుగునీటి కాలువలు క్లీనింగ్, వీధిలైట్లు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సచివాలయ కార్యదర్శిని శ్రీరామచంద్రమూర్తిని ఆదేశించారు. సిబ్బంది అటెండెన్సు, రికార్డులను పరిశీలించారు. ఈకార్యక్రమంలో సచివాలయ జేఏబిసి రమణమూర్తి, సచివాలయ కార్యదర్శిలు శంకరాచార్యులు, సత్య, మహిళా పోలీస్ జిఎన్ఎస్ శిరీష, డిజిటల్ అసిస్టెంట్ జనార్ధన్, వెల్ఫేర్ అసిస్టెంట్ దివాకర్, ఇంజనీరింగ్ అసిస్టెంట్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
సిఫార్సు