విశాఖలోని లయన్స్ కేన్సర్ ఆసుపత్రికి లారస్ ల్యాబ్ సిఈఓ చావ సత్యనారాయణ రూ . 25,00,000/- (ఇరవై ఐదు లక్షల రూపాయలు) హైదరాబాద్ లో గల లారెస్ చారిటబుల్ ట్రస్ట్ నుండి సిఎస్ఆర్ కార్యకలాపాల క్రింద అందజేశారు. విశాఖపట్నం, సీతమ్మథారలో గల లయన్స్ క్యాన్సర్, జనరల్ హాస్పిటల్ , లయన్స్ డిస్ట్రిక్ట్ 324 సి 1 ద్వారా నడుస్తున్న ఈ హాస్పిటల్ కు క్యాన్సర్ ట్రీట్మెంట్, రీసెర్చ్ సెంటర్ కు వైద్య పరికరాలు కొనుగోలు, ఇతర అభివృద్ధి కార్యకలాపాలలు రోగులకు సహాయం నిమిత్తం ఈ విరాళం అందజేశారు. ఈ సందర్భంగా లయన్స్ క్యాన్సర్ జనరల్ హాస్పిటల్ మేనిజింగ్ ట్రస్టి వి. ఉమామహేశ్వర రావు లారెస్ చారిటబుల్ ట్రస్ట్ వారికి థన్యవాదాలు తెలియ జేశారు. దీనివలన రోగులకు మరింత మెరుగైన వైద్యం అందించడానికి క్రృషి చేస్తామని ఈ సందర్భంగా వీడియాకి విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.