వరుపుల కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే గంటా


Ens Balu
22
Prathipadu
2023-03-15 15:20:36

 ప్రత్తిపాడు నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ దివంగత నేత వరుపుల రాజా లేని లోటు పూడ్చలేనిదని విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. బుధవారం ప్రత్తిపాడులోని వరుపుల కుటుంబాన్ని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రు, వైస్సార్సీపీ యువ నాయకులు  జక్కంపూడి గణేష్ టిడిపి శ్రేణులు మండల నాయకులతో కలిసి రాజా చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. అనంతరం  రాజా గారి సతీమణి   సత్య  ప్రభని పలకరించారు. మేము, పార్టీ  రాజా కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఇలాంటి కష్టకాలంలో మనసుని కాస్త దిటవు చేసుకోవాల ఓదార్చారు. ఈ సందర్భంగా రాజా పార్టీకి చేసిన సేవను కొనియాడారు. ఆయనలోటు మీకుటుంబంతోపాటు పార్టీకి తీరనిదన్నారు. ఈ కార్యక్రమంలో ప్రత్తిపాడు టిడిపీ నాయకులు, నెహ్రూ అనుచరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 
సిఫార్సు