అడవివరం సిడగంపేట ప్రాంతంలో కొలువై ఉన్న శ్రీ ఎల్లమ్మతల్లి పండుగ మహోత్సవం గురువారం అత్యంత ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామున అమ్మవారిని సుప్రభాత సేవతో మేలుకొలిపి ఆరాధన చేశారు. అనంతరం భక్తులందరికీ అమ్మవారి దర్శన భాగ్యం కల్పిం చారు. సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు,విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం సలహా మండలి సభ్యులు , జాతీయ జర్న లిస్టుల సంఘం కార్యదర్శి, వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీను బాబు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామదేవతల పండగలు ఎంతో విశిష్టమైనవని ఆయా అమ్మవార్ల ఆశీస్సుల వల్లే ప్రజలంతా సుభిక్షంగా ఉంటున్నారన్నారు. అమ్మవార్లే ప్రధాన రక్షణ అని కొనియాడారు. ఈసందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీగా అన్న సంతర్పన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు. నిర్వాహకులు పాల్గొన్నారు.