కాకినాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు గురువారం రెండో సర్కిల్ పరిధిలోని భాస్కర్ నగర్, శాంతినగర్ ప్రాంతాలలో పారిశుధ్య పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కొన్నిచోట్ల చెత్త తొలగింపులో సిబ్బంది అలసత్వాన్ని గుర్తించా రు. మెరుగైన పారిశుధ్య నిర్వహణ కోసం ఎన్నో పాలనా సంస్కరణలు అమలు చేస్తున్నప్పటికీ కొంతమంది క్రింది స్థాయి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు. ఇందుకు కారణమైన అక్కడి శానిటరీ సెక్రటరీ సూర్య కు షోకాజ్ నోటీస్ ఇవ్వాలని ఆదేశిం చారు. ఈ సందర్భంగా ఏడిసి నాగ నరసింహారావు మాట్లాడుతూ, ప్రజలు తడి పొడి- చెత్తను వేరువేరుగానే ఇవ్వాలని స్పష్టం చేశారు. ఆదివా రం కూడా చెత్త సేకరణ జరగాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా నాలుగో డివిజన్ లో పూడిక తీత పనులను ఏడిసి నాగ నరసింహారా వు పర్యవేక్షించారు ఈ కార్యక్రమంలో ఆయన వెంట శానిటరీ సూపర్వైజర్ జిలాని, సచివాలయ సిబ్బంది ఉన్నారు.