ఉత్తరాంధ్ర పట్టభధ్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికారపార్టీపై వ్యతిరేకతను పట్టభద్రులు స్పష్టంగా చూపించారు. వారికితోడుగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు కూడా వారి వ్యతిరేకతను ఓట్ల రూపంలో చూపించడం వలన టిడిపికి ఆది నుంచి మెజార్టీ వస్తోందని విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికారపార్టీ అధికార దుర్వినియోగంతో 5, 6, 7చదువుకున్నవారికి పట్లభద్రుల ఓట్లు ఇచ్చారనే ఆధారాలను ప్రభుత్వం ద్రుష్టికి, మీడియా ద్వారా ప్రజల ద్రుష్టికి తీసుకెళ్లడంలో టిడిపి, పిడిఎఫ్ లో పార్టీలు కీలకంగా వ్యవహరించాయి. కొన్నిచోట్ల డబ్బు లు పంచుతూ కూడా అధికారపార్టీకి చెందిన కొందరు నగదుతో పట్టుబడ్డారు. మరీ ముఖ్యంగా ఎన్నడూ లేని విధంగా ఈసారి ప్రభుత్వ ఉపా ధ్యాయులు పనిగట్టుకొని మరీ ఈ ఎన్నికలకు ఓట్లు నమోదు చేయించుకొని వారి వ్యతిరేకతను ప్రభుత్వానికి తెలియజేయడానికి వేదికగా వినియోగించుకున్నారు. ఒక్క ఉత్తరాంధ్రాలోనే కాదు రాష్ట్రంలో అన్నిచోట్ల టిడిపి ఆదిక్యంలో ఉంది.