మన ఇంటి పెరటి లేదా మేడపై సేంద్రియ పద్ధతిలో ఆహార పదార్థాలను పండించడం వలన శారీరక శ్రమతో పాటు ఆరోగ్యంగా జీవించవ చ్చని కంకణాలపల్లి రాధ పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడలోని సర్పవరం జంక్షన్ బోట్ క్లబ్ వాకర్స్ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఆరోగ్య అవగాహన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆమె మాట్లాడారు. నేడు రసాయనాల తో పండిస్తున్న కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు తీసుకోవడం వలన పలు దీర్ఘకాలిక రోగాలకు గురవుతున్నామని అన్నారు. సంపూర్ణ ఆరోగ్యం కోసం తమ ఇంటి మేడపై సేంద్రియ పద్ధతిలో కూరగాయలు, పండ్లు, ఆకుకూరలను పండిస్తున్నామని అన్నారు. అవకాశం ఉన్న మేరకు ఎవరికి వారు సొంతంగా ఆహార పదార్థాలను సేంద్రీయ పద్ధతిలో పండించుకోవడం వలన శారీరక శ్రమతో పాటు నాణ్యమైన ఆహార పదార్థాలను స్వీకరించవచ్చని రాధా తెలిపారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్న ప్రసాద్, ఎస్. శ్రీ నగేష్, చింతపల్లి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.