మహిళలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం- 2013 అనుసరించి పని ప్రదేశాలలో లైంగిక వేధింపులు అరికట్టడానికి గాను అంతర్గత ఫిర్యా దుల కమిటీలను యాజమాన్యం ఏర్పాటు చేయాలని న్యాయవాది కె .నాగజ్యోతి పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడ సర్పవరం జంక్షన్ లో మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జరిగిన అవగాహన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆమె మాట్లాడారు. పని ప్రదేశాలలో లైంగిక వేధిం పులు రోజురోజుకీ పెరుగుతూనే ఉన్నాయని అన్నారు. బాలికలు, వృద్ధులు అనే తేడా లేకుండా అత్యాచారాలు జరుగుతున్నాయని అన్నారు. మహిళల రక్షణకు పోరాడి సాధించుకున్న చట్టాలు సక్రమంగా అమలు కావడానికి అధికారులు చర్య తీసుకోవాలని అన్నారు. సామాజిక మాధ్యమాల్లో లభిస్తున్న చౌకబారు సాహిత్యం, విచ్చలవిడిగా అందుబాటులో ఉన్న మద్యం వలన అత్యాచారాలు జరుగుతున్నాయని అన్నారు. అడబాల రత్న ప్రసాద్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో స్థానికులు పాల్గొన్నారు.