మునగపాక మండలంలో ఎంపిక చేసిన పదిమంది వాలంటీర్లకు ఆపదమిత్ర పథకం కింద ప్రత్యేక శిక్షణ కార్యక్రమం ఈనెల 25తో ముగుస్తుందని ఎంపీడీవో రవికుమార్ తెలిపారు. ఎంపిక చేసిన ఆపద మిత్రులకు కసింకోట మండలం సంపత్ పురం లో 12 రోజులు పాటు శిక్షణ కొనసాగుతుందన్నారు. ఈ శిక్షణ సమయంలో గ్యాస్ లీకేజీ, నీటిమనక, కరెంట్ షాక్, అనుకోని సంఘటనలు జరిగినప్పుడు అత్యవసరంగా తీసుకొని చర్యలు గురించి వీరికి శిక్షణ ఇస్తారన్నారు. శిక్షణ అనంతరం అత్యవసర కిట్లను కూడా వీరికి అందజేస్తారని ఎంపీడీవో తెలిపారు. ఈ వాలంటీర్లకు శిక్షణ కార్యక్రమంలో మునగపాక ఈఓపీఆర్డీ ఈశ్వరరావు పంచాయతీ, కార్యదర్శులు పాల్గొంటున్నారని ఎంపీడీఓ ఈ సందర్భంగా మీడియాకి వావరించారు.