వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దాడి వీరభద్ర రావు దంపతులను మర్యాదపూర్వకంగా అనకాపల్లిలోని వారి నివాసంలో కలిశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనకాపల్లి జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు ఈర్లే అనురాధ. జిల్లా పార్టీ మహిళా విభాగం అధ్యక్షరాలుగా అనురాధ నియామకంపై దాడి వీరభద్రరావు హర్షం వ్యక్తంచేశారు. ఈ పదవికి అనురాధ సరైన న్యాయం చేస్తూ, తండ్రి రాష్ట్ర ఉపముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు ఆశయాలు నెరవేర్చడం లో ముందున్నారని అయన ఈ సందర్భంగా కొనియాడారు. పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుని, పార్టీ మహిళలకు ఇస్తున్న ప్రాధాన్యతను క్షేత్ర స్థాయిలో వివరిస్తామని అనురాధ అన్నారు. జిల్లాలో మహిళల సంక్షేమం, సమస్యల పరిష్కారంలో సీనియర్ల సలహాలు, సూచనలు తనకు అందించాలని దాడిని కోరారు. సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్టుఆమె ఈ సందర్భంగా వివరించారు.