ప్రజాసేవతోనే సమాజ ప్రగతి సాధ్యమవుతుందని విశాఖ నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి అన్నారు. విశాఖ వెబ్ జర్నలిస్ట్స్ వెల్ఫే ర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం డాబా గార్డెన్స్ ప్రెస్ క్లబ్ లో ఉగాది సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరస్పాండెంట్ ఎస్ కే రత్నం, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు ఎం.వెంకటరావు, ఏబి. గ్రూప్ చైర్మన్,ఏ.బి. చారిటబుల్ సొసైటీ ప్రెసిడెంట్ డా.ఎంఎస్ స్వరూప్ లను సేవా స్ఫూర్తి పురస్కారాలతో ముఖ్య అతిథి గా విశాఖ మేయర్, గౌరవ అతిధి గా వైజాగ్ జర్నలిస్ట్ ల ఫోర మ్ అధ్యక్షులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి,సింహాచల దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు గంట్ల శ్రీనుబాబులు అందజే శారు. అనంతరం మేయర్ గొలగాని హరి వెంకట కుమారి మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా నిలుస్తున్న జర్నలిస్టుల సేవలు అభి నందనీయమని చెప్పారు. అసోసియేషన్ ప్రతినిధులు చేస్తున్న సేవలను కొనియాడారు.