ప్రకటనల మోజులో పడి విద్యార్థులు అత్యాశకుపోయి సొమ్ము పోగొట్టుకోవద్దని ప్రముఖ న్యాయవాది, సామాజిక కార్యకర్త, జిల్లా కన్జ్యూమర్ డిస్ప్యూట్స్ రీడ్రెసల్ కమిషన్`1సభ్యురాలు రహీమున్నీసా కోరారు. తల్లిదండ్రులు కూడా ఈ విషయంలో దృష్టి సారించాలన్నారు. బహరా పాలిటెక్నిక్ కళాశాలలో ఆమె శనివారం కన్జ్యూమర్ క్లబ్‌ను ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఏ వస్తువు కొనుగోలు చేసినా అందుకు తగ్గ బిల్లు, రశీదు పొందాలని విజ్ఞప్తి చేశారు. ఆన్‌లైన్ లావాదేవీలపైనా అప్రమత్తంగా ఉండాలన్నారు. వైద్య పరికరాలతో పాటు అత్యవసరాలకు ఉపయోగపడే సామగ్రి కొనుగోలు సమయంలో గడువు తేదీ, తయారీ దారు వివరాలు, నాణ్యత, బరువు, ధర సరిచూసుకోవాలన్నారు. వినియోగదారులకు మేలు కలిగించేలా, అందర్నీ అప్రమత్తం చేస్తూ పలు సూచనల్ని సోషల్ మీడియా ద్వారా అందరికీ తెలియజేయాలని కూడా రహీమున్నీసా బేగం కోరారు.