శంఖవరం ఐసిడిఎస్ సిడిపిఓగా టిడిఆర్.పద్మావతి


Ens Balu
29
Shankhavaram
2023-03-19 08:25:19

అంగన్వాడీల ద్వారా పిల్లలకు, బాలింతలకు పూర్తిస్థాయిలో పౌష్టికాహారం అందేలా చర్యలు తీసుకోవడంతోపాటు అభివ్రుద్ధికి శక్తివంచన లేకుండా క్రుషి చేస్తానని సిడిపిఓ టిడిఆర్ పద్మావతి పేర్కొన్నారు. శంఖవరం ఐసిడిఎస్ ప్రాజెక్టుకు నూతన సీడిపిఓగా బాధ్యతలు స్వీకరిం చారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అంగన్వాడీల్లో అమలుజరుగుతున్న కార్యక్రమాలపై ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టనున్నట్టు చెప్పారు. తన ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీల్లో ఎలాంటి సమస్యలు ఉన్నా తన ద్రుష్టికి తీసుకురావచ్చున న్నారు. అందరి సహకారంతో ప్రాజెక్టును ముందంజలో నడిపించే దిశగా పనిచేస్తానని చెప్పారు.  ఇక్కడ పనిచేస్తున్న ఇన్చార్జి సిడిపిఓ వేరే ప్రాజెక్టు వెళ్లడంతో ఈమెను ఇక్కడ ప్రభుత్వం నియమించింది. ఈ సందర్భంగా కార్యాలయంలోని సిబ్బంది, సూపర్ వైజర్లు నూతన సిడిపిఓ ను మర్యాదపూర్వకంగా కలిసి.. ప్రాజెక్టు పరిధిలోని కేంద్రాలు, సిబ్బంది వివరాలను నూతన సిడిపిఓకి తెలియజేశారు.

సిఫార్సు