రెండు రోజులు ప్రత్యేక ఆధార్‌ శిబిరాలు


Ens Balu
15
Kakinada
2023-03-19 13:35:49

ఆధార్‌లో మార్పులు చేర్పుల కోసం సోమ, మంగళవారాల్లో రెండు రోజులపాటు కాకినాడ ప్రత్యేక ఆధార్‌ శిబిరాలు నిర్వహించనున్నట్టు నగర పాలక సంస్థ కమిషనర్‌ కె.రమేష్‌ చెప్పారు. ప్రధానంగా  ఆధార్‌ కార్డులలో ఉన్న పాత తూర్పుగోదావరి జిల్లా ను కాకినాడ జిల్లాగా మార్పు చేసు కోవడంతో పాటు ఇతర మార్పులు, చేర్పుల కోసం ఈ శిబిరం నిర్వహిస్తున్నామన్నారు. ఆధార్‌ కు మొబైల్‌ నెంబర్, మెయిల్‌ ఐడి అనుసంధా నం, చిరునామాలు, పుట్టినతేదీల్లో మార్పులు, ఇతర సేవలు కూడా పొందవచ్చునన్నారు. ఆయా సేవలకు సంబంధించి నిర్ణీత సొమ్ము చెల్లించాల్సి ఉంటుందని కమిషనర్‌ స్పష్టం చేశారు. కాకినాడ నగరంలోని కృష్ణనగర్‌–2ఎ, డైరీఫారం–11ఎ, గోళీలపేట –14ఎ, యానాం రోడ్డు–15ఎ, చిన్నమార్కెట్‌ –21ఎ, యాళ్ళవారి వీధి–28బి, జగన్నాథపురం–30బి, బ్యాంక్‌పేట 32ఎ, గాంధీనగర్‌–38ఎ, రామారావుపేట–40బి, గైగోలు పాడు–50బి సచివాలయాలలో ఈ శిబిరాలు కొనసాగుతాయన్నారు.
సిఫార్సు