ఆధార్ కార్డును 2016 నుంచి అప్డేట్ చేయించుకోని వారంతా ప్రత్యేకంగా నిర్వహిస్తున్న ఆధార్ క్యాంప్ ద్వారా అప్డేట్ చేయించుకోవాలని ము నగపాక ఎంపీడీఓ రవికుమార్ సూచించారు. సోమవారం మునగపాక మండలంలో తోటాడ గ్రామపంచాయతీలో నిర్వహిస్తున్న ఆధార్ క్యాంప్ ను ఎంపీడీఓ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం ఆధార్ కార్డు కలిగిన వారు పదేళ్ల ఒక్కసారైనా తమపేరు వివ రాలు, ఫోటోలను అప్డేట్ తప్పనిసరిగా చేయించుకోవాలన్నారు. దానికోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ ఆధార్ క్యాంపులను నిర్వహిస్తోందన్నారు.