జర్నలిస్టుల సంక్షేమమే ద్యేయమని స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు బంగారు అశోక్ కుమార్ అన్నారు. సోమవారం సాయంత్రం శిల్పారామం(జాతర) లో నిర్వహించిన ఎస్సిఆర్డబ్ల్యూఏ( మధురవాడ యూనిట్ ) సభ్యులకు దుస్తులు,స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టులందరూ ఐక్యతతో ఉంటేనే ఏదైనా సాధించవచ్చని అన్నారు. జర్నలి స్టులకు అండగా అసోసియేషన్ ఉంటుందని.. ఆతరువాతసంస్థ ఆవిర్భావం, సభ్యుల సంక్షేమం కోసం సంస్థ తరపున చేస్తున్న కార్యకలాపా లను వివరించారు. నిరంతరం పాత్రికేయుల సంక్షేమం కోసం పరితపించే సంస్థగా వారి యోగ క్షేమాలు,కష్టనష్టాల్లోనూ పాలుపంచుకుంటూ ఎప్పుడూ వెన్నంటే పాత్రికేయలతోనే ఉంటున్న సంస్థగా ఆయన చెప్పారు. ప్రతి జర్నలిస్ట్ ఆర్థికంగా, ఆరోగ్యంగా ఉండాలనేది అసోసియేషన్ ముఖ్య ఉద్దేశమన్నారు. స్మార్ట్ సిటీ రిపోర్టర్ వెల్ఫేర్ అసోసియేషన్ స్థాపించి సుమారు7ఏళ్ళు అవుతొందన్నారు.
ఈఏడేళ్లలో అసోసియేషన్ తరపున ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు.సభ్యుల సహాయ సహకారాలతో అసోసియేషన్ ను మరింత బలోపేతం చేయడానికి అలాగే అసోసియేషన్ తరపున మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి తన శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు. జర్నలిస్టులు తమ తమ కుటుంబ సంక్షేమం పట్ల కూడా శ్రద్ధ వహించాలని అన్నారు.అనంతరం సీనియర్ పాత్రికేయులు సాక్షి కేటీ.రామునాయుడు మాట్లాడుతూ జర్నలిస్టులందరూ ఐక్యతగా ఉంటూ అసోసియేషన్ ను అభివృద్ధి బాటలో నడిపించుకోవాలని పిలుపునిచ్చారు.మరో సీనియర్ పాత్రికేయులు ఆంధ్ర జ్యోతి శ్రీనివాస్ జర్నలిస్టు సమస్యల సంక్షేమంతో పాటుగా జర్నలిస్టుల పిల్లలకు స్కూల్ ఫీజుల్లో రాయితీ కల్పించేలా అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని అధ్యక్షులు అశోక్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు.అనంతరం సభ్యులకు దుస్తులు,మిఠాయిలు అందజేసి శోభాకృత్ నామ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు కిరణ్,ఎల్లాజీరావు,బాలుపాత్రో, సీనియర్ పాత్రికేయులు నాగోతి నర్సినాయుడు,సాక్షి సత్యనారాయణ,వేణుగోపాల్ పట్నాయక్,సునీల్ కుమార్ పోలిమాటి తదితరులు పాల్గొన్నారు.