శంఖవరం మండల కేంద్రంలోని శ్రీ నూకాలమ్మ అమ్మవారి పండుగను గ్రామస్థులు ఘనంగా నిర్వహించారు. మెయిన్ రోడ్డులోని అమ్మవారి ఆలయంలో ఉదయం నుంచే ప్రత్యేక పూజలు, పసుపు, కుంకుమల సమర్పణ మొదలైంది. అమ్మవారి పండుగ సందర్భంగా సోమవారం రాత్రి నుంచే ఆలయ ప్రాంతంలో దేదీప్యమానంగా విద్యుత్ అలంకరణలు చేపట్టారు. ప్రతీఏటా అమ్మవారికి ఈ పండుగ రోజు భక్తులు కోళ్లు, మేకపోతులను మొక్కుకుంటారు. వాటిని ఉదయం ప్రత్యేక డప్పువాయిద్యాలతో ఊరేగింపుగా వచ్చి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి అమ్మవారికి సమర్పిస్తారు.