సింహాచలం అడవివరం గ్రామం పరిధిలోని
చాకిరేవుకొండ జంగాల పాలెంలో కొలువైవున్న నూకాంబిక అమ్మవారికి జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, విజెఎఫ్ అధ్యక్షుడు, సింహాచలం ధర్మకర్తల మండలి సభ్యులు గంట్లశ్రీనుబాబు దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. మంగళవారం అమ్మవారిని దర్శించుకొని పట్టువస్త్రాలు, పసుపు కుంకుమలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, అమ్మవారు ఎస్సీ కాలనీలో కొలువైవుండి గ్రామాన్ని ఎల్లవేళలా కాపాడుతున్నారని అన్నారు. పండుగ సందర్భంగా అమ్మవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ నిర్వాహకులు..స్థానిక యువత పాల్గొన్నారు.