ఆంధ్రప్రదేశ్ లోని ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఇపుడు ప్రధానపార్టీల పీకమీదకి వచ్చాయి. 2024 ఎన్నికల్లో సీటు కన్ఫార్మ్ కాని అధికార పార్టీ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ వేస్తారనే ప్రచారం సోషల్ మీడియాని ఒక ఊపు ఊపుతోంది. ఇరుపార్టీల ఎమ్మెల్యేలకు విప్ జారీచేయడంతో విప్ కి కట్టుబడే ఎమ్మెల్యేలు ఎన్నికల్లో పాల్గొంటున్నా రని అసెంబ్లీ సాక్షిగా జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నిక చెబుతోంది. ఉదయం వరకూ తిరుగుబాటు అధికారపార్టీ ఎమ్మెల్యేలు మాత్రమే ఓటింగ్ వ్యతిరేకంగా చేస్తారని అనుకున్నా.. ఇంతవరకూ వచ్చే ఎన్నికల్లో పోటీచేసే విషయంలో క్లారిటీ రాని ఎమ్మెల్యేలు అంతర్మధనంలో పడ్డారని కూడా చెబుతున్నారు.అదే జరిగితే టిడిపి అభ్యర్ధి ఎమ్మెల్సీ కావడం తప్పేటట్టు లేదు. కానీ కొండకి..వెంట్రుకకు ముడివేయకుండా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈఎన్నికల్లో అధికారపార్టీ స్వచ్చందంగానే ఓటింగ్ లో పాల్గొని ఓటువేస్తుందని మాత్రం తెలుస్తుంది. చూడాలి ఫలితాలు ఎవరిని ఏవిధంగా ప్రభావం చేస్తాయనేది సాయంత్రానికి..!?