గర్భిణీ స్త్రీలు పోషకాలు ఉండే 8రకాల చిరుధాన్యాలను ఆహారంలో తీసుకోవడంద్వారా కడుపులోబిడ్డ ఆరోగ్యంగా ఎదుగుతుందని సిడిపిఓ టిడిఆర్ పద్మావతి అన్నారు. గురు వారం శంఖవరం గ్రామసచివాలయం-1లో ఏర్పాటుచేసిన పోషన్ పక్వాడ్ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అంగన్వాడీ కేంద్రా ల ద్వారా ప్రభుత్వం పౌష్టిక ఆహారం అందిస్తున్నదన్నారు. వాటితోపాటు, ఆకుకూరలు, పాలు, పండ్లు, తీసుకోవడం ద్వారా గర్భిణిస్త్రీ రక్తహీనత నుంచి బయట పడవచ్చు న న్నారు. ఐదేళ్లలోపు చిన్నారులకు, కిషోర బాలికలకు బాలామ్రుతం పెట్టడంద్వారా పుష్టిగా ఎదగడానికి ఆస్కారం వుంటుందన్నారు. సచివాలయ మహిళా పోలీస్ జిఎ న్ఎస్.శిరీష తాను బాలింతగా ఉన్నప్పుడు తీసుకున్న ఆహారాలను, పాటించిన నియమాలను అందరికీ తెలియజేశారు. అనంతరం ఏర్పాటుచేసిన పోషకాహార ఎగ్జిభిషన్ ను ఉసర్పంచ్ కుమార్, వైఎస్సార్సీపీ నాయకులు లచ్చబాబులు తిలకించి రుచిచూశారు. పిల్లల తల్లులు పాల్గొన్నారు.