వ్యవసాయరంగానికి అధికి ప్రధాన్యత.. రమావత్


Ens Balu
25
Devarakonda
2023-03-25 09:53:15

వ్యవసాయ రంగానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని దేవరకొండ ఎమ్మెల్యే,బిఆర్ఎస్ నల్గొండ జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. శనివారం దేవ రకొండ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన ఆగ్రో ఎంప్లాయిస్ వెల్పేర్ అసోసియేషన్ ప్రైవేట్ ఉద్యోగుల సంఘ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆగ్రో ఎంప్లాయి స్ వెల్పేర్ అసోసియేషన్ ప్రైవేట్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు.ఆగ్రో ఎంప్లాయిస్ వెల్పేర్ అసోసియేషన్ ప్రైవేట్ ఉద్యోగుల సంక్షేమానికి ప్రభు త్వం కృషి చేస్తుందని,ఆగ్రో ఎంప్లాయిస్ వెల్పేర్ అసోసియేషన్ ప్రైవేట్ ఉద్యోగుల భవనం నిర్మాణానికి సొంత నిధుల నుంచి నిధులు మంజూరు చేస్తాననిహామీ ఇచ్చారు. ఆగ్రో ఎంప్లాయిస్ వెల్పేర్ అసోసియేషన్ ప్రైవేట్ ఉద్యోగులకు అండగా ఉంటానన్నారు. గ్రామీణ ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అల్లంపల్లి నర్సింహ, వైస్ ఎంపీపీ చింతపల్లి సుభాష్ ,బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు హన్మంత్ వెంకటేష్ గౌడ్,బిఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేముల రాజు,ఆగ్రో ఎంప్లా యిస్ వెల్పేర్ అసోసియేషన్ అధ్యక్షుడు జాఫర్,ఎర్ర విజయ్,గుండా రాజా రావు,బొడ్డుపల్లి కృష్ణ,జెల్ల వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.
సిఫార్సు