2016 లో కొనుగోలు చేసిన భూమికి రిజిస్ట్రేషన్ చేయడానికి తహసిల్దార్ కార్యాలయం చుట్టూ ఏడు సంవత్సరాలు తిరిగిన రిజిస్ట్రేషన్ చేయకపో వడంలో గల ఆంతర్యం ఏమిటి అని బాధితుడు అబ్రహం ఆవేదన వ్యక్తం చేశారు. ఈమేరకు ఆయన మంగళవారం మీడియా వద్ద తన గోడు వెల్లబోసుకున్నాడు. పెదబయలు మండలం సీతగుంట పంచాయతీ పెదబయలు గ్రామానికి చెందిన చెండా అబ్రహము 2016 సంవత్సరం లో అరకువేలి మండలం ఎండపల్లివలస గ్రామానికి చెందిన గొండ లక్ష్మీ దగ్గర 11 సెంట్లు భూమిని కొనుగోలు చేసి.. అదే ఏడాది నవంబరులో అన్ని రకాల ఆధారాలతో అరకువేలి తాసిల్దార్ కి భూ రిజిస్ట్రేషన్ కొరకు అర్జీ పెట్టుకున్నారు. అప్పటి తాసిల్దార్ దస్తావేజులను పరిశీలించి పా డేరు సబ్ కలెక్టర్ ఆఫీస్ కు పంపగా, అక్కడనుండి ఈ విషయాన్ని సరి చేయగలరని రాసి మరలా అరకు వేలి తహసిల్దార్ కార్యాలయానికి పం పించేసి తిప్పుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. తాను భూమి సక్రమంగానే కొనుగోలుచేశానన్నాడు.