ఛలో శృంగవృక్షం కార్యక్రమానికి అనుమతులు లేవు


Ens Balu
17
Tondangi
2023-03-30 04:57:02

కాకినాడ జిల్లాలోని తొండంగి మండలం శృంగవృక్షం గ్రామానికి "చలో శృంగవృక్షం 30-03-2023" అంటూ కొన్ని సంఘాలు  పిలుపునిచ్చినట్లు గా సామాజిక మాధ్యమాలలో సర్క్యులేట్ అవుతూ ఉందని సదరు కార్యక్రమానికి ఎలాంటి అనుమతులు లేవని పెద్దాపురం డిఎస్సీ ఎస్.ముర ళీమోహన్ తెలియజేశారు. ఈ మేరకు ఆయన మీడియాకి ప్రకటన విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఎవరూ రావొద్దని కోరారు. అంతేకాకుండా గ్రామంలో ప్రస్తుతం  సామరస్య , సుహృద్భావ వాతావరణం ఉందని దానికి విఘాతం కలిగించవద్దని పేర్కొన్నారు. అలాకాకుం డా  హద్దు మీరి గ్రామంలో  శాంతియుత వాతావరణానికి  విఘాతం కలిగించే వారు ఎవరైనా సరే వారిపై చట్ట పరంగా కఠిన చర్యలు తీసుకుం టామని హెచ్చరించారు. ఈ విషయంలో ప్రభుత్వ నిబంధనలు జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీల ఆదేశానుసారం అమలు చేస్తున్నట్టు మీడియాకి విడుదల చేసిన ప్రకటనలో డిఎస్పీ పేర్కొన్నారు.

సిఫార్సు