వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం


Ens Balu
21
Simhachalam
2023-03-30 12:39:17

సింహాచలం కొండ దిగువన కొలువై ఉన్న శ్రీ సీతారాముల ఆలయంలో స్వామివారి కల్యాణ మహోత్సవం గురువారం అంగరంగ వైభవంగా జరిగింది.  స్వామివారి కళ్యాణం సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.  సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు, విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం సలహా మండలి సభ్యులు, జాతీయ జర్నలిస్ట్ ల సంఘం కార్యదర్శి, వైజాగ్ జర్నలిస్ట్ లు ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీను బాబు దంపతులు స్వామివారి కల్యాణంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి నూతన వస్త్రాలు సమర్పించారు. వేద పండితులు అర్చకులు వేద ఆశీర్వచనం అందజేసి తీర్థప్రసాదాలను ఇచ్చారు. అనంత రం శ్రీను బాబు మాట్లాడుతూ లోకకళ్యాణార్థం జరిగే నవమి వేడుకల్లో భక్తులంతా పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలు పొందాలని.. శ్రీరాముని చల్లని దయతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని స్వామిని కోరుకున్నట్టు వివరించారు.

సిఫార్సు