జిరాయితీ భూమిలో సాగుదార్లకు పట్టాలు ఇవ్వలేం
VK.Mahesh
359
చీడికాడ
2023-04-01 14:14:43
జిరాయితీ భూమిలో సాగుదారులకు పట్టాలు మంజూరు చేయడం కుదరదని జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి తెలిపారు. శనివారం ఆమె అనకాపల్లి జిల్లా, చీడికాడ మండలం కోనాం శివారు కొత్త వీధి గ్రామం సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె జిరాయితీ భూమిలో సాగు చేసుకుంటున్న గిరిజనులను కలిశారు. వారు సాగు చేసుకుంటున్న భూమి ప్రభుత్వ భూమి అయితేనే పట్టాలు ఇవ్వడం జరుగుతుందని, రికార్డులను పరిశీలించగా 289 సర్వే నంబరు లో 29.86 సెంట్ల భూమి రెవెన్యూ రికార్డుల ప్రకారం రైతు వారి మెట్టు భూమిగా నమోదయిందని చెప్పారు. జిరాయితీ పట్టా కాబట్టి కౌలుదారులకు ఎటువంటి హక్కు ఉండదన్నారు. వీలును బట్టి వారికి మరొకచోట ప్రభుత్వ భూమి ఇచ్చేందుకు ప్రత్యామ్నాయం ఆలోచిస్తామని తెలిపారు. జెసి వెంట చీడికాడ తాసిల్దార్ బి.వి రాణి తదితరులు ఉన్నారు.