అప్పన్న కళ్యాణోత్సవం పూర్తిస్థాయిలో విజయవంతమైన నేపథ్యంలో సోమవారం ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు ఈవో వి.త్రినాధ రావును ఘనంగా సత్కరించారు. కళ్యాణంలో దేవస్థానం అధికారులతో పాటు అన్ని విభాగాల సిబ్బంది సేవలందించడం అభినందనీయ మన్నారు. అలాగే ఈ నెల 23 న రానున్న చందనోత్సవం(అప్పన్న నిజరూప దర్శనం) కూడా పూర్తిస్థాయిలో విజయవంతం చేయాలని.. దానికోసం ధర్మకర్తల మండలి తరపున తమవంతు సంపూర్ణ సహకారం అందిస్తామని సభ్యులు ఇఓ కి తెలియజేశారు. ఈ సందర్భంగా ఈఓ త్రినాధ్ రావు మాట్లాడుతూ, అందరి సహకారంతోనే ఉత్సవం విజయవంతం చేయగలిగా మన్నారు. కళ్యాణోత్సవానికి భారీగా భక్తులు తరలివ చ్చినప్పటికీ ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తిస్థాయిలో భక్తులకు ఏర్పాట్లు చేశామన్నారు. ఇందుకు సహకరించిన ధర్మ కర్తల మండలి సభ్యులతో పాటు ప్రతి ఒక్కరికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.