సిఆర్పిఎఫ్ పోలీసుల సేవలను గిరిజన ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని 198 బెటాలియన్ ఇనిస్పెక్టర్ అజయ్ కుమార్ మిశ్రా అన్నారు. సోమవారం సిఆర్పిఎఫ్ 198 బెటాలియన్ ఆధ్వర్యంలో సివిక్ యాక్షన్ ప్రోగ్రాంలో భాగంగా పెదబయలు మండలం కృష్ణాపురం గ్రామంలో ఇన్ స్పెక్టర్, ముంచంగిపుట్టు ఎస్సై రవీంద్ర లు సంయుక్తంగా 200 మంది గిరిజనులకు దోమతెరలను పంపిణీ చేశారు. సిఆర్పిఎఫ్ ఇనెస్పెక్టర్ మాట్లాడుతూ, ప్రజలకు ఎప్పుడూ అండగా ఉంటామన్నారు. గతంలో గొడుగులు, రేడియోలు, చలి దుప్పట్లు, క్రీడా సామాగ్రి పంపిణీ చేశామ ని.. ఇపుడు పంపిణీ చేసే దోమతెరలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. యువత అసాంఘిక క్రమ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ముంచంగిపుట్టు ఎస్సై రవీంద్ర, హెడ్ కానిస్టేబుల్ రమేష్, మాజీ సర్పంచ్ పండ సుబ్రహ్మ ణ్యం తదితరులు పాల్గొన్నారు.