ఎంతో విలువైన కంటెంట్‌తో కూడిన ట్యాబ్‌లను ప్రభుత్వం విద్యార్థులకు ఉచితంగా అందజేసిందని, వాటిని పూర్తిస్థాయిలో వినియోగించేలా చూడాలని ఉపాధ్యాయులను, జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి ఆదేశించారు. ఈ కంటెంట్‌లో ఉన్న ప్రతీ సబ్జెక్టుకు సంబంధించిన క్లాస్ టెస్టు ను విద్యార్ధులు చేత చేయించాలని సూచించారు. నెల్లిమర్ల మండలంలోని కస్తూరిభా గాంధీ బాలికల విద్యాలయాన్ని మంగళవారం, ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇంటర్ 1, 2 సంవత్సరం విద్యార్ధులతో మాట్లాడారు. ఉన్నత విద్యపట్ల వారి భవిష్యత్ ప్రణాళికలను తెలుసుకు న్నారు. కేవలం ఇంజనీరింగ్, మెడిసిన్ లాంటి కోర్సులే కాకుండా, సిఏ, లా తదితర ఎన్నో ప్రత్యామ్నాయ అవకాశాలు ఉన్నయని చెప్పారు. విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ ఇవ్వాలని, ఉపాధ్యాయులకు సూచించారు. ఎనిమిదో తరగతి విద్యార్ధులకు ప్రభుత్వం అందజేసిన ట్యాబ్‌లను తనిఖీ చేశారు. వాటి వినియోగం, సబ్జెక్టు టెస్టుల నిర్వహణ, టెస్టుల్లో వచ్చిన మార్కులపై ఆరా తీశారు. ట్యాబ్ ద్వారా అందిస్తున్న కంటెంట్ అర్ధం అవుతుందా లేదా అని విద్యార్థులను ప్రశ్నించారు. డిక్షనరీ వినియోగించే విధానాన్ని పరిశీలించారు. బాగా చదువుకొని, మంచి మార్కులు తెచ్చుకోవాలని సూచించారు. ఈ తనిఖీలో ఎంపిడిఓ జి.గిరిబాల, ఎంఈఓ ఎ.కృష్ణారావు, కెజిబివి ప్రిన్సిపాల్ బి.ఉమ పాల్గొన్నారు.