నెల్లిమర్ల మండలంలోని ఇవిఎం గోదాములను జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి మంగళవారం తనిఖీ చేశారు. స్ట్రాంగ్ రూములను పరిశీలించారు. అక్కడి భద్రతా ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. అప్రమత్తంగా ఉండాలని సిబ్బందిని ఆదేశించారు. తనిఖీల్లో జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గణపతిరావు, నెల్లిమర్ల తాసిల్డార్ రమణ రాజు, ఎంపిడిఓ జి.గిరిబాల, మున్సిపల్ కమిషనర్ పి.బాలాజీ ప్రసాద్, ఎన్నికల విభాగం సూపరిం టిండెంట్ నీలకంఠ రావు, లోక్‌సత్తా నాయకురాలు రాయి పద్మావతి, ఇతర రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.