సీఎం వైఎస్ జగన్ తోనే ప్రజా సంక్షేమం.. ఎమ్మెల్యే పర్వత
Ens Balu
12
Sankhavaram
2023-04-04 12:02:57
సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తోనే ప్రజా సంక్షేమ పూర్తి స్థాయిలోఅమలు జరుగుతోందిని ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత శ్రీ పూర్ణచంద్ర ప్రసాద్ అన్నారు. గడపగడపకి మన ప్ర భుత్వ కార్యక్రమంలో భాగంగా మంగళవారం శంఖవరం గ్రామ సచివాలయం-3లో ఎమ్మెల్యే పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పిల్లల ఉన్నత చదు వులు, అర్హులకు పింఛన్లు అందాలంటే రానున్న ఎన్నికల్లో వైఎస్సార్సీపీకే ఓటువేయాలన్నారు. సంక్షేమం, అభివృద్ధి జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమని, సంక్షేమం వైఎస్సా ర్సీపి పరిపాలనకు మారుపేరు అని అన్నారు. అర్హులైన వారందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించే జగనన్నను ప్రతీ ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలని ప్రజలను కోరా రు. అనంతరం ఎమ్మెల్యే పర్వత సచివాలయ కన్వీనర్లు, వాలంటీర్లు, గృహసారథిలతో జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. ఎంపీపీ పర్వత రాజ బాబు, ఎంపీడీవో రాంబాబు, జట్ల సోమేశ్వరరావు, ఎ.వీరబాబు, తదితరులు పాల్గొన్నారు.