ఫ్యామిలీ డాక్టర్ విధానంతో మరింత వైద్యసహాయం


Ens Balu
14
Sankhavaram
2023-04-06 07:25:31

ఫ్యామిలీ డాక్టర్ విధానంతో ప్రజలకు మరింత మెరుగైన వైద్యం ఇంటి ముంగిటే అందుతుందని ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వతశ్రీపూర్ణ చంద్ర ప్రసాద్ అన్నారు. బుధవారం శంఖవరం మండల కేంద్రంలోని పీహెచ్సీకి మంజూరు చేసిన 104 వాహనాన్ని ఆయన జెండా ఊపి ప్రారంభిం చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గ్రామంలో ప్రతీ నిరుపేదకు అన్ని రకాల రోగాలకు వైద్యసేవలు అందించాలన్నదే ముఖ్యమం త్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఆశయమని పేర్కొన్నారు. అందులో భాగంగానే ప్రతీ గ్రామసచివాలయం పరిధిలోని ఒక విలేజ్ క్లినిక్ కూడా ప్రభు త్వం ఏర్పాటు చేసిందని చెప్పారు. ఇకపై వైద్యసేలు ప్రారంభం అవుతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రాజబాబు, వైఎస్సార్సీపీ నాయకు లు,  పీహెచ్సీ వైద్యాధికారి ఆర్వీవి. సత్యన్నారాయణ, డా.ఎస్ఎస్ఆర్. కుమార్, ఎంపీహెచ్ఈఓ మల్లిఖార్జునరావు, పీహెచ్ఎన్.కె.మేరీ, పారామె డికల్ సిబ్బంది సూర్యకాంతం, నూకరత్నం, నాగమణి, కుమారి తదితరులు పాల్గొన్నారు. 
సిఫార్సు