జర్నలిస్టుల కుటుంబాలకు అండగా ఉంటా


Ens Balu
22
Visakhapatnam
2023-04-06 10:04:26

జర్నలిస్టులు, వారి కుటుంబాలకు నిరంతరం అండగా ఉంటామని వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు అన్నారు. గురు వారం దాబా గార్డెన్స్ విజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో ఇటీవల మృతి చెందిన సీనియర్ వీడియో జర్నలిస్ట్ చిన్న కుటుంబానికి విజేఎఫ్ తరఫున రూ.75వే లు ఆర్థిక సహాయంతోపాటు, డెత్ సర్టిఫికేట్ ను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, చిన్న కుటుంబానికి  మంత్రి అమర్నాథ్ తో పాటు ప్రజాప్రతినిధులతో మాట్లాడి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వారి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించే విధంగా కృషి చేస్తున్న ట్లు తెలిపారు. ప్రభుత్వ పరంగా రావాల్సిన అన్ని రకాల రాయితీలను అందించేందుకు తమ వంతు బాధ్యతగా పని చేస్తున్నా మన్నారు. పగ లు, రాత్రి అనే తేడా లేకుండా సేవలు అందించే జర్నలిస్టులకు వారి కుటుంబాలకు నిరంతరం సేవ చేసేందుకు తాము ఎల్ల ప్పుడూ సిద్ధం గా ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో విజె ఎఫ్ కార్యవర్గ సభ్యుడు ఈరోతి ఈశ్వరరావు పాల్గొన్నారు.

సిఫార్సు