మహిళలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఉన్నత స్థానంలో ఉండాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆకాంక్ష అని కాకి నాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. అందువల్లే మహిళల అభివృద్ధి, సంక్షేమం కోసం ఎన్నో పాలనా సంస్కరణ లు అమలు చేయడంతో పాటు 70 శాతం పథకాలను మహిళల పేరుతోనే ఇస్తున్నారన్నారు. శారదాదేవి ఆలయం సమీపంలో గురువారం జరి గిన వైయస్సార్ ఆసరా సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ మహిళల గౌరవాన్ని పదింతలు పెంచిన ఘనత ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిదేనన్నారు. మనసుతో ఆలోచించే ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని పరిపా లిం చడం ప్రజల అదృష్టమన్నారు. కౌడా చైర్ పర్సన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి , కమిషనర్ కే. రమేష్, అదనపు కమిషనర్ సిహెచ్ నాగ నరసింహా రావు, వైయస్సార్సీపీ నగర అధ్యక్షురాలు మాజీ మేయర్ సుంకర శివప్రసన్న, ఎమ్మెల్సీ అభ్యర్థి కర్రి పద్మశ్రీ పాల్గొన్నారు.