బోయ వాల్మీకి,బెంతు, ఒరియా లను ఎస్టీ జాబితాలో చేర్చడానికి వీలులేదని రాజవొమ్మంగి మండలం లోదొడ్డి పంచాయతీ సర్పంచ్, గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోతా రామారావు ఆధ్వర్యంలో పంచాయితీ పాలకవర్గం గురువారం ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఈ సందర్భంగా వా ర్డు సభ్యులు జర్తా రాజబాబు అధ్యక్షతన పంచాయతీ పాలకవర్గ సమావేశంలో మాట్లాడుతూ ,బోయ, వాల్మీకి, బెంతు, ఒరియా లను ఎస్టీ జాబి తాలో చేర్చేందుకు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానించి కేంద్రానికి పంరాని.. అయితే ఎటువంటి గిరిజన సాంప్రదాయాలు లేని బిసి ఏ లో ఉన్న బోయ వాల్మీకి,బెంతు ఒరియా 40లక్షలు మందిని ఎస్టీ జాబితాలో చేర్చాలని ప్రభుత్వం 52 జీవో తీసుకువచ్చిందన్నారు. దీ నివలన ఏజెన్సీ ప్రాంతంలో నివసిస్తున్న నిజమైన గిరిజనులు 25 లక్షల మందికి తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. త క్షణం ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 52 ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.