ఆదిత్యుడుని దర్శించుకున్న మంత్రి అమర్నాధ్


Ens Balu
15
Arasavilli
2023-04-10 11:23:48

కలియుగ ప్రత్యక్షదైవం, ఆరోగ్య ప్రదాత అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాధ్ సో మవారం దర్శించుకున్నారు. జిల్లా పర్యటనలో భాగంగా ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ అర్చకులు పూర్ణకుంభం, పూలమాలలతో ఘనంగా స్వాగతం పలికారు. తదుపరి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు,స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. ఈ కా ర్యక్రమంలో  ఆర్డీఓ బొడ్డేపల్లి శాంతి, తహశీల్దార్ కె.వెంకటరావు, పాలకమండలి సభ్యులు, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.

సిఫార్సు